యూరియా సరఫరా సన్నబియ్యం సాగుపై సమీక్ష
సిద్దిపేట , జూలై 3(చైతన్యగళం): జిల్లాలో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్నబియ్యం సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 36 శాతం అదనంగా వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్ పూర్తవడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులను ఇబ్బందులకు గురిచేసే...