CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీజేపీ నాయకుడు జగదీష్ గౌడ్ పిలుపు

రంగారెడ్డి(చైతన్యగళం) : మంచాల మండలంలోని లోయపల్లి గ్రామంలో…….
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని బీజేపీ నాయకుడు జగదీష్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించి, కొత్తగా పేరు నమోదు చేయించుకోవడం, తప్పులు ఉంటే సరిచేయించడం, అవసరమైతే మార్పులు చేయించుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని జగదీష్ గౌడ్ అన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు.