CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:30 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత వేగం పెంచాలి – ఇబ్రహీంపట్నం డివిజన్ ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, జూలై 2 ( చైతన్యగళం) : ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని తట్టి అన్నారం ఆర్కేనగర్ గ్రామంలో ఎస్ఐఆర్ కింద జరుగుతున్న జగనణన ఫారం పంపిణి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనగణన ప్రక్రియ పురోగతిని అంచనా వేసి పనులు వేగం పెంచాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశాడు. ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయి ప్రయాత్నాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. బీఎల్వోలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం తట్టి అన్నారం తాజా మాజీ కౌన్సిలర్ దేవిడి గీత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే పునాది అని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఓటరు జాబితా కచ్చితత్వం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. బీఎల్ఓలు చేస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఫారాలను సకాలంలో పూర్తిచేసి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోవర్దన్, గణేష్, బీఎల్ఓలు, తదితరులు పాల్గొన్నారు.