జమ్మికుంట, జూలై 2 (చైతన్యగళం):
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పదవీకాలం ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా జమ్మికుంటలో ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో బొమ్మల గుడిలో పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ధార్మిక సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్ బచ్చు శివకుమార్, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ పాల్గొని, “హైందవ చైతన్యమే బిజెపి లక్ష్యం. హిందూ ధర్మ పరిరక్షణకై, పురాతన దేవాలయాల సంరక్షణకై బిజెపి ఎప్పటికీ ముందుంటుంది. సమాజంలో హిందువులపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపడతాం” అని పేర్కొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఒక సంవత్సరం పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసి అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొండ్ల నగేష్, టంగుటూరి రాజ్‌కుమార్, పొన్నగంటి రవికుమార్, పాకాల రవీందర్ రెడ్డి, ఎం. సాని సమ్మయ్య, ఎద్దులాపురం శ్రీనివాస్, సిరియాల విజయ్, చంద సంతోష్, కాశీనాథం, అజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.