ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు

కల్వకుర్తి, జులై 02(చైతన్యగళం): ప్రభుత్వ జూనియర్ కాలేజీ కల్వకుర్తి నందు విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం సన్మానం చేయడం జరిగింది. ఎంపీసీ సెకండ్ ఇయర్ లో 971 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన స్పందన శ్రీశైలం,నందిని,సతీష్ లను సన్మానించి అవార్డులు బహుమతులు బంగారు పతకాలను అందించడం జరిగింది, వచ్చే సంవత్సరం 975 మార్కులు సాధించే విద్యార్థులను ఫ్లైట్లో మా సొంత టికెట్లతో విహారయాత్రకు తీసుకెళ్తామని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు...