సమాజ సేవలో దైవకృప వెల్ఫేర్ సొసైటీ ఆదర్శం
మహబూబాబాద్, జూలై 2 (చైతన్య గళం): మహబూబాబాద్ ఆశ్రమంలో గురువారం దైవకృప వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 40 మంది వికలాంగులకు ఉచిత ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ఆశ్రమ నిర్వాహకుడు భానోత్ లోకేష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా టౌన్ సీఐ లతకుల రఘుపతి రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు ట్రైసైకిళ్లను అందజేశారు.ఈ సందర్భంగా సీఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ, “నిరుపేదలు, వికలాంగులు, అనాథలు, వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మం. భానోత్ లోకేష్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తి” అని అన్నారు....