బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

మహబూబాబాద్, జూలై 2(చైతన్యగళం): బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్య అని, వాటిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు కమల్ కుమార్, సునీత సూచించారు. మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక బాలల సదనంలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలందరూ క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరై విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని...