CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:28 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మహిళా వికలాంగుల విద్య, ఉపాధి పై అవగాహన సదస్సు

హబ్సిగూడ, జూలై 2 (చైతన్యగళం): హబ్సిగూడ కిన్నెర గ్రాండ్ హోటల్‌లో గురువారం ఇన్ లైట్ సంస్థ అధినేత సురేష్ ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా వికలాంగుల విద్య, ఉద్యోగ ఉపాధి, మౌలిక సదుపాయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, జవాబు సీఈఓ నల్గొండ శ్రీనివాస్, ఫెడ్ నాగభూషణం, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్, రాంచందర్, విఆర్పి బాబు, రాంబాబు నాగమణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వికలాంగుల విద్య, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలపై సమగ్ర చర్చలు జరగగా, సమాజంలో వారికి మరింత స్థానం కల్పించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు.