మానకొండూరులో ఇసుక డంపులు సీజ్
కరీంనగర్, జూలై 2 {చైతన్యగళం}: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం మానకొండూరు మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాపూర్, తెనుగుపల్లి గ్రామాల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 భారీ ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేశారు. ఈ డంపుల్లో మొత్తం 115 ట్రిప్పుల ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న...