మహిళా సంఘాలకు యూనియన్ బ్యాంక్ వరం ఎస్ హెచ్ జి రుణాలపై ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలకు 100 శాతం మాఫీ
సిద్దిపేట, జూలై 02 {చైతన్యగళం} మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జి ఎస్ ) ఆర్థిక సాధికారతకు మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ హెచ్ జి. రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలకు 100 శాతం మినహాయింపు ప్రకటించింది. బ్యాంకు క్రెడిట్ అప్రూవల్ కమిటీ ఆమోదంతో ఈ నిర్ణయం 2026 జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చినట్లు సిద్దిపేట రీజినల్ హెడ్, లీడ్ బ్యాంక్ అధికారి బి. శ్రీనివాస్ తెలిపారు. కొత్త...