సఖి సెంటర్ భరోసాగా నిలవాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కరీంనగర్ జూలై 01(చైతన్యగళం) కరీంనగర్ ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సఖి (వన్ స్టాప్) సెంటర్ అన్ని వేళలా అండగా నిలిచి, అవసరమైన రక్షణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాస సేవలను సమర్థవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కరీంనగర్ సప్తగిరి కాలనీలోని సఖి (వన్ స్టాప్) సెంటర్‌ను వారు ఆకస్మికంగా సందర్శించి కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించారు. బాధిత మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కేసుల నిర్వహణ, అత్యవసర...