బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిని కలిసిన జిల్లా అధ్యక్షుడు

రాజన్న సిరిసిల్ల, జూలై 1 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన కొనరావుపేట్ మండలం మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ బుధవారం జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నూతన బాధ్యతలు చేపట్టిన అన్నపూర్ణను శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “జిల్లాలో మహిళా మోర్చా సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా...