ఎదురెదురుగా ఢీకొన్న ఆటో–బైక్.. యువకుడి దుర్మరణం

ఆమనగల్లు, జూలై 1 (చైతన్య గళం‌): ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడు మాడుగుల మండలం ఫకీరతండాకు చెందిన మల్లేష్ (28)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేష్ ద్విచక్ర వాహనంపై ఆమనగల్లు నుంచి స్వగ్రామమైన ఫకీరతండాకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు మల్లేష్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు...