ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కంబాలపల్లి గ్రామంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తున్న తీరును ఆకస్మికంగా పరిశీలించారు. ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందజేయాలని, సందేహాలను నివృత్తి...