మహబూబాబాద్‌లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

మహబూబాబాద్(చైతన్యగళం): జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తైందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ తెలిపారు. మొదటి రోజు 469 కేంద్రాల ద్వారా 73,570 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులను గుర్తించి టీకాలు అందించాయి. రెండో, మూడో రోజుల్లో కూడా ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించారు. మూడు రోజుల కార్యక్రమం ముగిసే నాటికి జిల్లాలో 101...