CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 11:10 am Posted by : CHAITHANYA GALAM NEWS

మహబూబాబాద్‌లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

మహబూబాబాద్(చైతన్యగళం):
జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తైందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ తెలిపారు.

మొదటి రోజు 469 కేంద్రాల ద్వారా 73,570 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులను గుర్తించి టీకాలు అందించాయి. రెండో, మూడో రోజుల్లో కూడా ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించారు.

మూడు రోజుల కార్యక్రమం ముగిసే నాటికి జిల్లాలో 101 శాతం కవరేజ్ సాధించినట్లు ఆయన వెల్లడించారు. ఈ విజయానికి సహకరించిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.