పల్స్ పోలియో విజయవంతం

మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం మూడో రోజు విజయవంతంగా ముగిసింది. సబ్ యూనిట్ ఆఫీసర్ వడ్డేబోయిన శ్రీనివాస్ కలెక్టర్ గృహం పరిసరాలు, ఆర్డీఓ కార్యాలయ వీధి, బస్టాండ్ మెయిన్ రోడ్ సబ్ సెంటర్, అంబేద్కర్ నగర్, గిరి ప్రసాద్ నగర్ కాలనీ, గుమ్ముడూరు తదితర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు రోజులుగా పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులను గుర్తించి వారి ఇళ్లకు...