ప్రతిభకు ప్రోత్సాహం – విద్యార్థులకు పురస్కారాలు
మంచాల, జూలై 1 (చైతన్యగళం): మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం మండల కేంద్రంలో ఎజుకేట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పారితోషికాలు అందజేశారు. గత పదేళ్లుగా పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న తాళ్లపల్లిగూడకు చెందిన విద్యావేత్త డా. ఎస్.కే. బిక్షపతి ఈసారి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నోట్‌బుక్స్, డ్రెస్సులు, చేతి గడియారాలు తదితర ప్రోత్సాహకాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల...