బీజేపీ గిరిజనుల కోసం చేసిన ఒక్క గొప్ప పని చెప్పాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్(చైతన్యగళం): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. జిల్లా క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, గిరిజనులకు 10% రిజర్వేషన్, గురుకుల విద్యాసంస్థల విస్తరణ, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి అధికారిక నిర్వహణ, సేవాలాల్ భవన్, కొమరం భీమ్ భవన్ నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు కేసీఆర్ హయాంలోనే జరిగాయి” అని...