మల్కాజ్గిరి, జూలై 1 (చైతన్యగళం): ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వర్షాకాలంలో ముంపుకు గురయ్యే కాలనీలను సందర్శించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అత్యవసర సమయంలో సమస్యలు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో బారివర్షానికి ముంపుకు గురైన కిరణ్ గుత్తికొండ ఇంటిని కూడా పరిశీలించారు.ఈ సందర్శనలో మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మురుగేష్, నాయకులు నీలం సతీష్, మండలి విజయ్ కుమార్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.