ఎస్‌ఐఆర్ విధానాన్ని పరిశీలించిన మర్రిగూడ తహసిల్దార్

మర్రిగూడ, జూలై 1 (చైతన్యగళం‌): మర్రిగూడ మండల కేంద్రంలోని ఖుదాబాక్షపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ 2026 ఎన్యుమరేషన్ ఫారాల నింపే విధానాన్ని తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు పరిశీలించారు. బీఎల్ఓ యాప్ ద్వారా ఆన్‌లైన్ వివరాల నమోదు ప్రక్రియను తనిఖీ చేసి, బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఖుదాబాక్షపల్లి గ్రామ సర్పంచ్ జయలక్ష్మి పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి,...