విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు

మహబూబాబాద్, జూలై 1 (చైతన్య గళం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, “విద్యార్థులు చిన్నతనం నుంచే ప్రాథమిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. నాణ్యమైన విద్య ప్రతి బాలబాలిక హక్కు. లైంగిక వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు నిర్భయంగా ఉపాధ్యాయులు, అధికారులకు ఫిర్యాదు చేయాలి” అని సూచించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ లీగల్...