“ఆపరేషన్ ముస్కాన్–12” ప్రారంభం

మహబూబాబాద్(చైతన్యగళం): జిల్లాలో జూలై 1 నుంచి 31 వరకు “ఆపరేషన్ ముస్కాన్–12” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులు, భిక్షాటన చేస్తున్న పిల్లలు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించి రక్షించి వారి కుటుంబాలకు చేర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లాలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, పరిశ్రమలు,...