మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేయూత – మంత్రి గడ్డం వివేకానంద
మంచిర్యాల (చైతన్యగళం): రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గ్రామైక్య సంఘ భవనం, ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, “మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు రుణ సదుపాయాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం చేయూత అందిస్తోంది” అని అన్నారు. గ్రామైక్య సంఘ భవనం రూ.15 లక్షల DMFT నిధులతో...