ఆకుతోటపల్లిగేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ట్రాన్స్‌జెండర్ దుర్మరణం
ఆమనగల్లు, జూలై 1(చైతన్యగళం): ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లిగేట్ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాన్స్‌జెండర్ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం, రోడ్డుపై వెళ్తున్న జీపును అదే దిశలో వెనుక నుంచి వస్తున్న ఆటో బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ట్రాన్స్‌జెండర్ అమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన అమ్ములును చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్ర...