మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం):
జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ స్నేహ శబరీష్ తెలిపారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నియమించిన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫారాలను అందజేస్తున్నారని ఆమె వివరించారు.
ఈ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను సక్రమంగా నమోదు చేసి, అవసరమైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించాలని ఆమె కోరారు.
ఎన్యుమరేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజల సహకారం అత్యంత కీలకమని, అధికారులు–సిబ్బంది సమన్వయంతో ఫారాలను సకాలంలో పూర్తి చేసి అప్పగించాలని సూచించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.