ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుకు మంటలు
అప్రమత్తమైన సిబ్బంది - తృటిలో తప్పిన ప్రమాదం కరీంనగర్, జూలై 1 (చైతన్యగళం): కరీంనగర్ ఆర్టీసీ రెండో డిపోలో బుధవారం తెల్లవారుజామున ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. టీజీ-02 టీ 1741 నంబర్ గల ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా, డిపో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. డిపో ప్రాంగణంలో నిలిపి ఉంచిన బస్సులోని బ్యాటరీ వ్యవస్థలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. మంటలను గుర్తించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం...