రిటైర్ అయిన ఉపాధ్యాయులకు బకాయిలు తక్షణమే చెల్లించాలి

ఖానాపూర్ (చైతన్యగళం): పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని పి.ఆర్.టి.యు అధ్యక్షులు నరేంద్రబాబు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా మలక్ చించోలి బి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సగం కృష్ణ పదవీ విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. సగం కృష్ణ ఉద్యోగ కాలంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేసి, విద్యార్థుల సంఖ్య పెంచి, నిధులను సమర్థవంతంగా వినియోగించి, పిల్లలతో మమేకమై ఆటపాటల ద్వారా విద్యాబోధన చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ నిబంధనలను క్రమశిక్షణతో...