ఇంటి స్థలాలు, పట్టాలు, నెంబర్ల కోసం సీపీఐ కలెక్టరేట్ ముట్టడి
మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం): ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ట్రాక్టర్‌పై గుడిసె ఏర్పాటు చేసి, ఇంటి నమూనాలను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారధితో పాటు సుమారు 40 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు...