రైతు శ్రేయస్సుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
మహబూబాబాద్(చైతన్యగళం): రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల నిధులు విడుదల...