నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన చిలువేరు సమ్మయ్య గౌడ్
కేసముద్రం, జూలై 1 (చైతన్యగళం): మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్‌నగర్ కాలనీ 15వ వార్డుకు చెందిన రామిళ్ల ఉపేంద్ర (48) క్యాన్సర్‌తో మృతిచెందడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కుటుంబం ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలేపాక నాగరాజు, కౌన్సిలర్ సునీతా భద్రు నాయక్ ద్వారా చిలువేరు సమ్మయ్య గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. వ్యక్తిగతంగా అందుబాటులో లేకపోయినా...