ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి
సుల్తానాబాద్, జూలై 1(చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) దేవస్థానంలో బుధవారం తేనెటీగలు భక్తులపై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్శనం కోసం వచ్చిన భక్తులపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు విరుచుకుపడటంతో ఆలయ ప్రాంగణం క్షణాల్లోనే భయాందోళనకు గురైంది. భక్తులు ప్రాణభయంతో పరుగులు తీయడంతో ఆలయ పరిసరాలు గందరగోళంగా మారాయి. దర్శనం అనంతరం, చెట్ల కింద వంట చేసుకుంటుండ గా ఒక్కసారిగా పొగ రావడం తో తేనెటీగలు లేచి దాడి చేశాయని అక్కడున్న భక్తులు తెలిపారు. కరీంనగర్ నుండి...