అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు.. రూ.70 లక్షలు సీజ్
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో పోలీసులు నిందితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుల ఇళ్ల నుంచి రూ.70,25,000 నగదును సీజ్ చేశారు. అత్యధిక శాతం నగదు నిందితుడు అవినాశ్ శుక్లా ఇంట్లో లభించింది. అతడి ఇంట్లో రూ.20 లక్షలను సీజ్ చేశారు. కరుణేశ్ పాండే ఇంటి నుంచి మరో రూ.18 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనుకల్ప్ మిశ్రా ఇంట్లో రూ.16 లక్షలు...