హైదరాబాద్, జూన్ 29(చైతన్యగళం): తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం డివిజన్ బీజేవైఎం యువ నాయకుడు కాకరాల చైతన్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని వీబీఐటీ కళాశాలలో నిర్వహించిన “వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్క్లేవ్” కార్యక్రమంలో ఈ భేటీ జరిగింది.
దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో విద్యార్థులు ముందుండాలని నితిన్ నబిన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యువతలో నాయకత్వ లక్షణాల పెంపు, విద్యా అవకాశాలు, స్టార్టప్‌ల ప్రోత్సాహం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయన విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.