ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాపై అప్రమత్తత అవసరం

వెల్డండ, జూన్ 29 (చైతన్యగళం): చేర్కూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ప్రతి అర్హుడైన పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలి. తప్పులు సరిచేసుకోవడం, కొత్తగా అర్హత పొందిన వారు పేర్లు నమోదు చేసుకోవడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, వివరాల్లో మార్పులు చేయడం వంటి అంశాలపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ...