నాలుగేళ్ల తర్వాత మళ్లీ మోగిన బడి గంట..
సైదాపూర్, జూన్ 29 {చైతన్యగళం} నాలుగు సంవత్సరాలుగా విద్యార్థుల నమోదు లేక మూతపడిన గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమవారం తిరిగి ప్రారంభమైంది. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సమిష్టి కృషితో పాఠశాల మళ్లీ పిల్లల కేరింతలతో కళకళలాడింది. పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి వెన్నెముకలాంటివని, గ్రామస్థుల సహకారంతో మూతపడిన పాఠశాలను తిరిగి ప్రారంభించడం ఆదర్శప్రాయమని ఆయన అన్నారు. గ్రామ ప్రజల...