గ్రామీణ రోగులకు నాణ్యమైన సేవలందించాలి – నాళ్ల వీరన్న

మహబూబాబాద్, జూన్ 29(చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించినప్పుడే వైద్య వృత్తికి నిజమైన గౌరవం దక్కుతుందని ప్రముఖ వ్యాపారి, ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ యజమాని నాళ్ల వీరన్న అన్నారు.మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (గైనకాలజీ)గా నూతనంగా విధుల్లో చేరిన డాక్టర్ పూల లక్ష్మీప్రియను సోమవారం తన నివాసంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వైద్యులు రోగులకు నమ్మకమైన, మానవీయ సేవలు అందించి వారి ఆశీస్సులు పొందాలి” అని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...