ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ,జూన్ 29(చైతన్యగళం): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి ఖరీఫ్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతు కుటుంబాలు ఆయురారోగ్యాలతో...