ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ విక్రయాలపై విద్యాశాఖ హెచ్చరిక

మహబూబాబాద్, జూన్ 29 (చైతన్యగళం): జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలను పాఠశాల ప్రాంగణంలో విక్రయించడం, తల్లిదండ్రులను నిర్దిష్ట దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని బలవంతం చేయడం ఇకపై సహించబోమని జిల్లా విద్యాశాఖ స్పష్టం చేసింది.జిల్లా విద్యాధికారి ఆర్‌సీ నం.1489/బి-4/2026, తేదీ 30-05-2026 ద్వారా అన్ని మండల విద్యాధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలు పూర్తిగా నిషేధించబడ్డాయని, తల్లిదండ్రులపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలనే అమలు చేయాలని...