CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 6:08 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

రాజేంద్రనగర్ , జూన్ 29 (చైతన్యగళం): రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గండిపేట్ మండల్ కి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. 29మంది కి రూ 29లక్షల 3364వేల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ … పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.పేదింటి యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో లబ్ధిచేకూరుస్తున్నాయన్నారు
కార్యక్రమంలో మండల తహసిల్దార్ సిబ్బంది స్థానిక నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.