CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 9:12 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మందమర్రిలో బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశం

మంచిర్యాల, జూన్ 29 (చైతన్యగళం): మందమర్రి పట్టణంలోని బి-1 కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏ-2 ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, “బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలి. బీఎల్‌ఏ-2 వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఓటరు జాబితాపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలి” అని సూచించారు.

అలాగే, ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.