మర్రిగూడ, జూన్ 29 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని శివన్నగూడ గ్రామపంచాయతీ పరిధిలో అంతర్జాతీయ సహకార వారోత్సవాలను “సహకారంతో శ్రేయస్సు” నినాదంతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ బాలేం నరసింహ పాలకవర్గ సభ్యులతో కలిసి సహకార సంఘం ఆవరణలో మొక్కలు నాటారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో సీఈవో మధు గౌడ్ యాదగిరిరావు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.