ఘనంగా ప్రారంభమైన వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026

వ్యాపారాభివృద్ధి, పరస్పర సహకారమే లక్ష్యం పాల్గొన్న 250 మంది పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు వ్యాపారాభివృద్ధి, నెట్‌వర్కింగ్‌, పరస్పర సహకారమే లక్ష్యం హైదరాబాద్, జూన్ 28 (చైతన్యగళం): దేశవ్యాప్తంగా ఉన్న వైశ్య వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న వీ వైశ్య గ్లోబల్ బిజినెస్ కాంక్లేవ్–2026 ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. మాదాపూర్‌లోని హోటల్ ఆవాసలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి ప్రముఖ...