పోలీస్ నియామకాలపై ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వినతి
మాడుగుల, జూన్ 28 (చైతన్య గళం): ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనావత్ శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ప్రతినిధుల బృందం OSD వేముల శ్రీనివాస్ రావు, IAS గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఎస్సై , పీసీ పోస్టులను కేవలం 5,000కే పరిమితం చేయకుండా 20,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అలాగే పోలీస్ నియామకాలలో గరిష్ట వయోపరిమితిని 36...