CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:39 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పోలీస్ నియామకాలపై ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వినతి

మాడుగుల, జూన్ 28 (చైతన్య గళం): ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనావత్ శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ప్రతినిధుల బృందం OSD వేముల శ్రీనివాస్ రావు, IAS గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఎస్సై , పీసీ పోస్టులను కేవలం 5,000కే పరిమితం చేయకుండా 20,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అలాగే పోలీస్ నియామకాలలో గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు పెంచి, వయోపరిమితి కారణంగా అవకాశాలు కోల్పోతున్న యువతకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశాలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వేముల శ్రీనివాస్ రావు గారిని కోరారు.

కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, నిరుద్యోగ యువత ప్రతినిధులు పాల్గొన్నారు.