CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 9:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నిండు జీవితానికి రెండు చుక్కలే శ్రీరామరక్ష..

ఇబ్రహింపట్నం, జూన్ 28 (చైతన్యగళం) : పోలియో నివారించేందుకు ఐదేళ్ల లోపు చిన్నారులకి రెండు పోలియో వ్యాక్సిన్ చుక్కల వేయించాలని మల్కిజ్ గూడ సర్పంచ్ శంకర్ అన్నారు. యాచారం మండల మల్కిజ్ గూడ లో సర్పంచ్ శంకర్ పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమమని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్తులో భారత దేశాన్నీ పోలియో రహిత దేశంగా తీర్చిదిందేకు అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకొని లేని పిల్లలను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది ఈనెల 29 సోమవారం,30 మంగవారు ఇంటింటి సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేయాలని సర్పంచ్ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ANM , ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.