పోలియో రహిత సమాజమే రోటరీ లక్ష్యం

మహబూబాబాద్, జూన్ 28 (చైతన్య గళం): పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ ప్రధాన పాత్ర పోషిస్తోందని మహబూబాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేమిశెట్టి కిషోర్ కుమార్ తెలిపారు. ఆదివారం రైల్వే స్టేషన్‌లో రోటరీ ఆధ్వర్యంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా జీవితాంతం రక్షణ కల్పించవచ్చు. తల్లిదండ్రులు ప్రతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. రోటరీ వ్యవస్థాపకుడు మాలె నాగేశ్వరరావు, జిల్లా నాయకులు వద్దుల సురేందర్ రెడ్డి,...