పోలియో రహిత భారతదేశమే మన లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్ , జూన్ 28 (చైతన్యగళం) : పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అత్యంత కీలకం అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. పికెట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత భారతదేశమే మన అందరి లక్ష్యమని, దీనిని సాధించాలంటే ప్రతి బిడ్డకూ క్రమం తప్పకుండా...