హుస్నాబాద్‌లో వరుస చోరీలు.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆరు దుకాణాలు, ఇళ్లలో దొంగల హల్‌చల్
చైతన్యగళం జూన్ 27 హుస్నాబాద్ హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై వరుసగా ఆరు దుకాణాలు, వాటి వెనుక ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భారీ చోరీలకు పాల్పడ్డారు. నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను అపహరించడంతో బాధితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెనుక భాగంలోని ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు భవనాలపైకి ఎక్కి, అంతర్గత మెట్ల మార్గం ద్వారా లోపలికి ప్రవేశించి చోరీలకు పాల్పడినట్లు స్థానికులు...