CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 11:24 pm Posted by : rakeshkashaveni12@gmail.com

అమర వీరుల స్థూపం భూములను కాపాడాలి: సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి 

 హుస్నాబాద్ జూన్ 28 (చైతన్య గళం)

హుస్నాబాద్ అమర వీరుల స్థూపం పరిసరాల్లోని సీలింగ్ భూములను కాపాడాలని, వాటిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అమర వీరుల స్థూపం సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. సుమారు నాలుగు ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూములు కుట్రపూరితంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జేఏసీ నాయకులతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా స్థూపం స్థలాన్ని పరిశీలించి భూములను కాపాడుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకొని అమరుల స్మృతిని పరిరక్షించే బాధ్యత మంత్రిపై ఉందన్నారు.సీలింగ్ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా కాపాడేందుకు జేఏసీ నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.